తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరో పాత్రల్లో ... విలన్ పాత్రలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడి గా ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటు వంటి రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
ఈ సినిమాలో డింపుల్ హయాతి ... గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది.
తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ రాజు ఈవెంట్ ను ఏప్రిల్ 20 వ తేదీన మర్గని ఎస్టేట్స్ ... వి ఎల్ పురం ... రాజమహేంద్రవరం లో ... సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గోపీచంద్ స్టైలిష్ లుక్ లో బ్యాగ్ ను పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో జగపతి బాబు .. కుష్బూ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.