టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో నాని ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండే మంచి విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక హీరో గా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే నాని నిర్మాతవ్గా కూడా చాలా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇకపోతే తాజాగా నాని "కోర్టు" అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.
ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావడంతో ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకుంది. ఇప్పటికీ కూడా ఈ మూవీ మంచి హోల్డ్ ను కనబరుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది. ఇకపోతే నాని హీరోగా రూపొందిన ఎన్నో సినిమాలు యూ ఎస్ ఏ లో 1 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక హీరోగా ఎన్నో సార్లు యూ ఎస్ ఏ బాక్సా ఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్లను రాబట్టిన నాని నిర్మాతగా కూడా యూ ఎస్ ఏ లో 1 మిలియన్ కలెక్షన్లను రాబట్టాడు.
తాజాగా ఈ మూవీ యూనిట్ యూ ఎస్ ఏ లో 1 మిలియన్ ప్లస్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అద్భుతమైన రీతిలో అవుతుంది. ఇలా నాని నటుడిగా , నిర్మాతగా రెండింటిలో కూడా యూ ఎస్ ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తాను చాటుకుంటున్నాడు.