ఆ విషయం పవన్ మామకు చేరింది.. సంతోషంగా ఉన్నా : సాయి ధరంతేజ్

praveen
మెగా హీరోలుగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అన్న విషయం తెలిసిందే. సముద్రకిని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కోలీవుడ్ హిట్ మూవీ అయిన వినోదయ సీతంకి ఇది తెలుగు రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇది రీమేక్ సినిమా కావడంతో ఇక ఈ సినిమాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై సాయి ధరంతేజ్  ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. విరుపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, మీరు కలిసి ఒరిజినల్ సినిమా చేస్తే బాగుంటుంది కదా రీమేక్ ఎందుకు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది... అయితే అది రీమేకా కాదా అన్న విషయం పక్కన పెడితే. నన్ను ఎవరైతే పెంచారో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉన్న. అది నా డ్రీమ్ కూడా. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మాటలు చెప్పలేనంత సంతోషం కలిగింది. అలాంటి ఛాన్స్ ఎందుకు వదులుకుంటా. మేం చేస్తున్న కథకు మాతృక సినిమా కథకు అస్సలు సంబంధం లేదు. కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం అంటూ సాయి ధరంతేజ్ చెప్పుకొచ్చాడు.


ఇకపోతే రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరంతేజ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మెగా అభిమానులు అందరూ కూడా గట్టిగానే కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: