ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది . దానితో వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్త కు అవకాశాలు దక్కుతున్నాయి.
అందులో భాగంగా ఇప్పటికే బింబిసరా ... సార్ మూవీ లతో వరుస విజయాలను ఈ ముద్దుగుమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. తాజాగా సంయుక్త "విరూపాక్ష" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా సాగుతున్న సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన సంయుక్త గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్ లో సంయుక్త అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంయుక్త కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.