ఆదిపురుష్ నుంచి రాబోతున్న ఫస్ట్ సింగల్...!!
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడనీ అందరికి తెలుసు.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో అయితే నిర్మించింది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.. అలాగే సైఫ్ అలీ ఖాన్ పది తలల రావణాసురిడిగా నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడనీ తెలుస్తుంది.. ఈ సినిమా అసలు జనవరి లోనే సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది అని ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఎప్పుడైతే విడుదల చేసారో అప్పటి నుండి ఆదిపురుష్ కు కష్టాలు స్టార్ట్ అయ్యాయట.
ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.. ఇంత భారీ బడ్జెట్ సినిమా కూడా విఎఫ్ఎక్స్ అంత దరిద్రంగా ఉండడం ఏంటని ఫ్యాన్స్ కూడా ఓం రౌత్ మీద ఫైర్ అయ్యారు. దీంతో టీమ్ వెనక్కి తగ్గి మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ కొత్తగా చేయడం స్టార్ట్ చేసి ఈ సినిమా విడుదల ను జూన్ 16కు వాయిదా వేశారు.. ఇక ఈ సినిమా నుండి ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారట.. గత కొన్ని రోజులుగా పోస్టర్స్ తో సరిపెడుతున్న మేకర్స్ రీసెంట్ గా జై శ్రీరామ్ సాంగ్ చిన్న బిట్ ను అఫిషియల్ గా విడుదల చేసారు.. ఈ పాట రామ భక్తులను అమితంగా అయితే నచ్చేసింది.. ఈ సాంగ్ ప్రోమో చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారట.. తాజాగా వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సాంగ్ ఈ ఏప్రిల్ చివరిలో విడుదల చేయనున్నట్టు టాక్.