'RRR' మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజా సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా ఫైనల్ అయినట్లు చెబుతున్నారు.
అలాగే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. స్పోర్ట్స్ బాడ్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. 1980 నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ మూవీగా బుచ్చిబాబు ఈ సినిమాని ప్లాన్ చేశారట. ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ గేమ్ ని మెయిన్ లీడ్ గా తీసుకున్నారట. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ కాళ్లు కోల్పోయిన అన్న పాత్రలో.. అలాగే ఆంధ్ర కబడ్డీ టీం కెప్టెన్ గా కూడా కనిపించరున్నాడు. అంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
తన అన్న కలను సాకారం చేసే తమ్ముడిగా ఈ సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఈ సినిమాని కంప్లీట్ గ్రాండ్ విజువల్స్ తో ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నాడట. ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చరణ్ ఫాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక రంగస్థలం సినిమాలో చెబిటివాడిగా నటించి మెప్పించిన రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి బుచ్చిబాబు మూవీ తో కాళ్లు కోల్పోయిన వ్యక్తిగా ఛాలెంజింగ్ పాత్రలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి...!!