టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వానికి ఎంతటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా తన నటనతో ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే ఈమె ఇటీవలే సినిమాలలో కాస్త తక్కువగా కనిపించిన నిరంతరం తన కూతురితో చేసేటువంటి ఫోటోలు, వీడియోల వల్ల వార్తలు నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన కూతురితోపాటు అందాల ఆరబోత చేస్తూ కుర్ర కారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. కూతురుని మించిన అందం తో సురేఖ కనిపిస్తూ ఉంటుందని అభిమానులు తెలియజేస్తూ ఉంటారు.
నటిగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్గా ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సురేఖ వాణి షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే.. సీనియర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో సురేఖ వాణి పార్టీలో పాల్గొన్న సందర్భంగా ఈ ఫోటోలను స్వయంగా సురేఖ వాణి నే షేర్ చేసింది. రాంగోపాల్ వర్మతో చాలా క్లోజ్ గా ఉన్న ఈమె ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. అయితే ఇలాంటి పార్టీలు వర్మాకేమీ కొత్త ఏమి కాదు గతంలో కూడా ఎంతోమంది హీరోయిన్స్ తో పార్టీలో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు సురేఖవాణి వర్మతో కలిసి దిగిన ఫోటో మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మరి కొంతమంది మాత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేంత వయసు సురేఖ వాణి ది కాదంటూ మరి ఎందుకు వర్మతో ఫోటో దిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి వర్మ చేతిలో మందు గ్లాసు ఉండగా సురేఖ వాణి చాలా క్లోజ్ గా ఈ సెల్ఫీ తీసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది .ఈ మధ్య వర్మ సినిమాలో జోరు తగ్గిన సురేఖ వాణి మాత్రం రెగ్యులర్గా సినిమాలలో నటిస్తూనే ఉంది.