సల్మాన్ ఖాన్ తో లవ్ పై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలం లో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. మొదట ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత ముకుంద, DJ, మహర్షి, అరవింద సమేత , అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇటీవలే బాలీవుడ్లో హీరో సల్మాన్ ఖాన్ తో కిసీకా బాయ్ కిసికి జాన్.. సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో వెంకటేష్ కూడా నటించబోతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ప్రమోషన్స్లో చేస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ప్రేమలో పడిందని ప్రస్తుతం వీరిద్దరూ డైటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా పూజా హెగ్డే రెస్పాండ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. సల్మాన్ ఖాన్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలలో అసలు నిజం లేదని సినిమాలో సల్మాన్ లవర్ గా కనిపిస్తా సల్మాన్ ఖాన్ కి నేను పెద్ద అభిమాని కావడంతో డేటింగ్ లో లేనని చెప్పేసింది పూజా హెగ్డే.

ప్రస్తుతం తాను సోలో గానే ఉన్నానని ఎవరి ప్రేమలో కూడా లేనని ప్రస్తుతం తన కుటుంబంతో తాను హ్యాపీగా గడపాలని కున్నాననీ ..తనకి లవ్ చేసే అంత సమయం కూడా లేదని తెలియజేసింది. టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ బాబుతో కలసి తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది ఒక్క చిత్రానికి ఈ ముద్దుగుమ్మ రూ .3కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనికేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: