పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ భారీ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియుల్లో కూడా ఎన్నో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాత్ర గురించి ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చాలా సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అడ్వంచర్ మూవీగా రానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.ఎస్ ఎస్ రాజమౌళికి పురాణాలు అంటే ఆసక్తి అని తన కథలను కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని రాస్తారని గతంలో చాలా సార్లు చెప్పారు. ఇక యాక్షన్ అడ్వంచర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ పాత్ర హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాశారట.
ఈ క్యారెక్టర్‌కు హనుమంతుడితో సమానమైన లక్షణాలు కూడా ఉంటాయని సమాచారం వినిపిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో భారీగా పోరాట సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుందనే వార్త కూడా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానప్పటికీ అభిమానులు మాత్రం ఈ అప్‌డేట్స్‌ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన ఆనందంలో ఉన్న రాజమౌళి రెట్టింపు ఉత్సాహంతో మహేశ్ బాబు సినిమా పనులు మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.