హీరోలను టార్గెట్ చేసిన శృతి హాసన్ !

Seetha Sailaja
క్రేజీ హీరోయిన్ శృతి హాసన్ తన మనసులో అనుకున్న మాటను ఎటువంటి మొహమాటం లేకుండా బయటకు చెపుతూ ఉంటుంది. నటిగా మాత్రమే కాకుండా ఈమెకు పెయింటింగ్ పొయట్రీ రైటింగ్ సింగింగ్ విషయాలలో మంచి ప్రావీణ్యం కూడ ఉంది. సినిమాలలో అవకాశాల కోసం ఈమె విపరీతంగా ప్రయత్నించదు అని అంటారు.

అందువల్లనే ఆమెకు సమర్థత ఉన్నప్పటికీ ఆమె దక్షిణాది టాప్ హీరోయిన్ కాలేకపోయింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హీరోల మనస్తత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాప్ హీరోల సినిమాలలో రొమాంటిక్ డ్యూయట్స్ తీయడానికి విదేశాలలో ఉన్న మంచు కురిసే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ రొమాంటిక్ సాంగ్స్ తీస్తే అది టాప్ హీరోల సినిమాలకు ప్లస్ అవుతుందని భావించి అలాంటి పాటలలో హీరోయిన్స్ మంచులో బాగా ఎక్స్ పోజింగ్ చేస్తే ప్రేక్షకులలో కిక్ వచ్చి ఆ పాట కోసం జనం విపరీతంగా వస్తారు అన్న ఉద్దేశ్యం ఇండస్ట్రీలో ఉన్న విషయాన్ని ఆమె గుర్తుకు చేసింది.

అయితే ఇక్కడ ఈ విషయంలో తనకు ఒక పద్ధతి అర్థం కావడంలేదు అంటూ అలాంటి మంచు కురిసే పాటలలో హీరోలు కోట్లు సూట్లు వేసుకుని క‌నిపిస్తే హీరోయిన్లు మాత్రం కుర‌చ దుస్తుల్లో అందాలు ఆర‌బోస్తూ కనిపించాలని హీరోలు చలి నుండి ఏమాత్రం సమస్య లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటే హీరోయిన్స్ మాత్రం ఆ చలిలో ఒణికిపోతున్నా తమ బాధను బయట పెట్టకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్ లో నటించాలని ఇది ఎంతవరకు న్యాయం అని ఆమె ప్రశ్నిస్తోంది. వాస్తవానికి తనకు మంచు పడదని అంటూ ద‌ర్శ‌కులంద‌రికీ ఒక విన్న‌పం అంటూ మంచులో పాటలు తీసేడప్పుడు హీరోలు లానే హీరోయిన్స్ కు కూడ కోట్లు వేసుకునే అవకాశం కల్పించండి అంటూ ‘వాల్తేర్ వీరయ్య’ లో చిరంజీవితో కలిసి నటించిన ఒక పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.

ఆ ఫోటోలో చిరంజీవి కోటుతో క‌నిపిస్తు ఉంటే శ్రుతి చీర‌లో క‌నిపించింది. అయితే ఈ విషయాన్ని మరొక విధంగా అర్థం చేసుకున్న చిరంజీవి ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: