సమంతకు ఇష్టమైన ఆహారం అదేనట..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ సమంత గడచిన కొన్ని రోజులుగా అన్ని మీడియాలలో చాలా హైలైట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉంటోంది. ఈ సినిమా ని ఒక అందమైన ప్రేమ కథ దృశ్య కావ్యం గా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసినట్లు ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే మనకి అర్థమవుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత ఆహారపు అలవాట్ల గురించి తాజాగా రివీల్ చేయడం జరిగింది.

ఇంతవరకు తనకు డైట్ ఫుడ్ గురించి ఎక్కువగా చెప్పింది.. అయితే ఈసారి తనకి ఇష్టమైన ఆహారాలు ఎలా తీసుకుంటుందో కూడా తెలియజేయడం జరిగింది. ఒక నటిగా ఫిట్నెస్ ఉండేందుకు బట్టర్ ఓట్స్ లాంటివి ఎన్ని తీసుకున్న టిఫిన్ లో ఇడ్లీ, సాంబార్ ఉంటేనే ఆ రోజు నాకు పండగే.. ఎక్కువగా తమిళవాసి లాగా సాంబారుని ఇష్టపడతానని తెలియజేస్తోంది సమంత.. ఇక సాంబార్ ని తనలాగా ఎవరు తాగలేరని కూడా తెలియజేస్తోంది. ముఖ్యంగా తన తల్లి చేసిన సాంబారు చాలా రుచిగా ఉంటుందని తెలియజేస్తోంది.

అలాగే ఫిల్టర్ కాఫీ అన్నా కూడా ఇష్టమని ఇంకా పరమాన్నము.. బిర్యానీ సాంబార్ రైస్ లాంటివి చూసి నాలుక రుచి చూడాల్సిందే అంటుంది టేస్ట్ చేసే వరకు తనకు మనసు అదోలా ఉంటుందని కూడా తెలిపింది.. ఇక స్వీట్స్ లో అయితే డైరీ మిల్క్ పాలకోవాలంటే చాలా ఇష్టము.అయితే వీటిని మాత్రం బ్యాలెన్స్గా తింటాను తీపి కావడంతో కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది అందుకే చాలా తక్కువగా తీసుకుంటానని తెలుపుతోంది.. వారంలో కనీసం ఒక రోజైనా సరే మసాలా వంటలు మొహమాటం లేకుండా తింటానని తెలుపుతోంది సమంత. తాను కూడా ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: