ఆ తేదీన బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్న "బ్రహ్మాస్త్రం" మూవీ..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను సనసగిస్తున్న రన్బీర్ కపూర్ హీరో గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఆలియా భట్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ ... నాగార్జున ... మౌని రాయ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు.


ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకులం ముందుకు రానున్న ఈ సినిమా మొదటి భాగం బ్రహ్మాస్త్ర భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ని తెలుగు లో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. 


ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ బుల్లి తెర ప్రసారానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 19 వ తేదీన స్టార్ మా చానల్లో ప్రసారం చేయనుంది. థియేటర్ లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: