ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు ఈ హీరో ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఈ సంవత్సరం మొదట గా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో రమేష్ కాడురి దర్శకత్వంలో రూపొందినటు వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మీటర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవి అతూల్య ... కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందు కోవడంలో కాస్త విపలం అయింది.
దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లీక్స్ సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లీక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సంస్థ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.