రజనీకాంత్ బాషా సినిమాను.. ఆ తెలుగు హీరోలు మిస్ చేసుకున్నారా?

praveen
దక్షిణాది చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . రజిని పేరు చెబితే చాలు పడి చచ్చిపోయే అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా ఒక బస్ కండక్టర్ స్థాయి నుండి ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా ఎదిగారు రజినీకాంత్. తన నటన తన మేనరిజంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా రజనీకాంత్ సినిమాలో ఎప్పటికీ ప్రేక్షకులకు ఎవర్గ్రీన్ గా నిలిచే సినిమా బాషా.

 ఈ సినిమా కేవలం సౌత్ ఇండియా వ్యాప్తంగానే కాదు అటు పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలో ముంబై ని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారుతాడు అన్నది కథ. ఈ కథ ప్రేక్షకులందరికీ కూడా మెప్పించింది అని చెప్పాలి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది. అయితే తెలుగులో డబ్ చేయాలని ముందుగా మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు సురేష్ కృష్ణ మాత్రం ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడట. బాలకృష్ణ లేదా చిరంజీవితో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించాడట.

 బాషా నిర్మాతలు అయిన దేవి శ్రీ థియేటర్లో తెలుగు స్టార్ హీరోల కోసం స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ సినిమా అంతగా ఎక్కలేదట. ఇక బాలయ్య అప్పటికే రీమేక్లకు దూరంగా ఉండేవారు. ఇక భాషా అవకాశాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారట. ఇక చిరంజీవి కూడా ఈ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో చేసేదేమీ లేక ఈ సినిమాని రీమేక్ చేయకుండా తెలుగులోకి డబ్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమాలో అటు రజనీకాంత్ సరసన నగ్మా హీరోయిన్గా నటించింది. రఘువరన్ విలన్ గా నటించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: