నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటు తన కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందినటు వంటి బింబిసారా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ... అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కేథరిన్ ... సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ "అమిగొస్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ హీరో డెవిల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను చిత్ర బృందం చాలా రోజుల క్రితమే విడుదల చేసింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో కళ్యాణ్ రామ్ గెటప్ వైవిధ్యంగా ఉండడంతో ఏ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ పతాకం పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు.