'రంగం' మూవీలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
2011 వ సంవత్సరంలో కోలీవుడ్ హీరో జీవా నటించిన తమిళ డబ్బింగ్ మూవీ 'రంగం' తెలుగులో ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. తమిళంలో కో అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాని తెలుగులో రంగం అనే టైటిల్ తో విడుదల చేయగా.. ఇక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో జీవా కి జోడీగా కార్తీక హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, అజ్మల్ తదితరులు కీలక పాత్రలో నటించారు. కె.వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. 


జర్నలిజం, పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రెండు ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులు, మూడు విజయ్ అవార్డులు, రెండు సైమా అవార్డులు అలాగే తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రావడం జరిగింది. ఇక రంగం సినిమా తర్వాత రంగం 2 అనే సినిమా కూడా వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే.. రంగం  సినిమాలో కార్తీకా తో పాటు మరో హీరోయిన్ గా పియా బాజ్ పై నటించింది. సినిమాలో హీరోని లవ్ చేసే పాత్రలో నటించి మంచి నటనను కనబరిచింది పియా బాజ్ పై. ఇక ఆ తర్వాత తెలుగులో నవీన్ చంద్ర సరసన దళం అనే సినిమాలో నటించింది.

 

ఇక ఆ తర్వాత తెలుగులో మరో సినిమా ఏమీ చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయింది పియా బాజ్ పై. ఇక ఈమె లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజెన్స్ రంగం హీరోయిన్ ఇంత అందంగా తయారయిందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్తోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. అటు మలయాళం లోను అడపాదనప సినిమాలు చేస్తోంది. రంగం సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె పిక్స్ కనిపించడంతో నేటిజన్స్ ఈమె లేటెస్ట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: