పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన తేరి అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు.
తెలుగు లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే తమిళ మరియు తెలుగు సినీ ప్రేమికులను అలరించిన ఈ మూవీ ని పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే టైటిల్ తో రూపొందించబోతున్నాడు. ఈ మూవీ పేరుకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీ కథ లోను ... స్క్రీన్ ప్లే లోను ... మరి చాలా విశాయలలోనూ చాలా మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ లో మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో శ్రీ లీల ... పవన్ సరసన హీరోయిన్ గా నటించినుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు నిలకొని ఉన్నాయి.