కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యి ప్రస్తుతం తమిళ సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటూ భారీ కలెక్షన్ లను వసూలు చేస్తున్న సినిమా విడుతలై పార్ట్ 1. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వే మారన్ దర్శకత్వం వహించగా ... ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో కమీడియన్ గా నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపున నవ్వించిన కమెడియన్ సూరి ఈ మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ లో ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే విడుదలై ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.
అసలు విషయంలోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జీ 5 "ఓ టి టి" సంస్థ కొనుగోలు చేసినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ ని జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నాడు.