HBD: రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక.ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంటూ తన కెరియర్ని జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. మొదట టాలీవుడ్లో ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో రాణించింది. అలాగే అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తోంది. కూడా కామెంట్లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూనే రష్మికకు సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక ఈ రోజున రష్మిక 27వ పుట్టినరోజు సందర్భంగా ఈమె రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.. రష్మిక నటించిన వారసుడు చిత్రానికి రూ .4కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు అమ్మడు డిమాండ్ మరింత పెరిగిందని ఇకపై రష్మిక కమిట్ అయ్యే చిత్రాలకు కచ్చితంగా రూ.6 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేయబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప-2 చిత్రంలో మాత్రమే చేస్తోంది ఆ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో మరొక సినిమా ని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ ఏడాది ప్రారంభంలో కూడా ఈ వేడుకలలో రష్మిక తన అంద చందా లతో బాగా ఆకట్టుకుంది. ఏది ఏమైనా రష్మిక ప్రతి పుట్టిన రోజుకు కూడా తన క్రేజీని మాత్రం పెంచుకుంటూనే కనిపిస్తోంది. మరి ఏడాది ఎన్ని సినిమాలతో బిజీగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: