దసరా సినిమాలో వెన్నెల పాత్రను కీర్తి సురేష్ తప్ప ఎవరు చేయలేరా..?
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కూడా ఈ గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించారు. వీరి నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా ధరణి పాత్రలు నాని కెరియర్లో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. అలాగే వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉండనుందని ఈమె కాకుండా వేరే ఎవరు కూడా ఈ పాత్రకు న్యాయం చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఒక వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.
వెన్నెలాగా కీర్తి సురేష్ ఊర మాస్ డాన్స్ వేసుకుంటూ వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియోలో ఆమె ఎనర్జీని చూసి అందరూ అవాక్కవుతున్నారు. కంటిన్యూగా డాన్స్ చేస్తూ కీర్తి సురేష్ చేసిన రచ్చ మామూలుగా లేదంటూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఎమోషన్ పండించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంటోంది .ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో తెగ వైరాల్ గా మారుతోంది.. ఏది ఏమైనా దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత నాని కెరియర్ లో అత్యధిక బ్లాక్ బాస్టర్ చిత్రంగా దసరా సినిమా నిలిచిందని చెప్పవచ్చు.