డీజే టిల్లు-2 రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Divya
డైరెక్టర్ విమల కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం.. డిజే టిల్లు చిత్రం. ఈ సినిమా లో సిద్దుకు జోడిగా నేహా శెట్టి హీరోయిన్గా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఈమె గ్లామర్ ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచింది. గత ఏడాది సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పడ్డారు హీరో అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వర నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.సూర్యదేవర నాగు వంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తూ ఉన్నారు. మొదటి నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పైన.. ఈ చిత్రానికి సంబంధించి ఒక గ్లింప్స్ ను కూడా  విడుదల చేయడం జరిగింది. అది కూడా బాగా మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ నీ మేకర్స్ లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అదే సమయంలో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలు కూడా విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. మరి డీజే టిల్లు -2 సినిమాని రిలీజ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బస్ ప్రకారం ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఒకవేళ ఈ విషయం కనుక నిజమే అయితే ఇద్దరు స్టార్ హీరోలతో సిద్దు జొన్నలగడ్డ పోటీపడవలసి ఉంటుంది దీనిపై త్వరలోనే అఫీషియల్ గా ఏదైనా ప్రకటన వెలుపడుతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ వస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: