మారిపోతున్న హీరోల ట్యాగ్ లపై గందరగోళం !

Seetha Sailaja
టాప్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో వారి అభిమానుల మధ్య కూడ వార్ పెరిగిపోతోంది. దీనితో టాప్ హీరోల అభిమానులు తమ హీరోలకు అప్పటికే ఉన్న ట్యాగ్ లను మార్చివేసి తమ హీరో ఎంత గొప్పవాడో అందరికీ తెలియచేసే విధంగా కొత్త ప్రమోగాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాలలో సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే.

నిన్న మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ అంటూ మెగా అభిమానులలో క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు అభిమానుల దృష్టిలో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. దీనితో అహం దెబ్బతిన్న జూనియర్ అభిమానులు తారక్ ను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ గా మార్చారు. దీనితో ఎలర్ట్ అయిన బాలయ్య అభిమానులు అతడిని ‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ గా మార్చేసారు.

జరుగుతున్న పరిణామాలు గ్రహించిన మెగా అభిమానులు మెగా స్టార్ చిరంజీవిని ‘బాస్ ఆఫ్ బాసెస్’ గా మార్చేసారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ అభిమానులు తమ హీరో కూడ ఈ రేస్ లో ఉన్నాడు అంటూ అప్పటి దాకా తాము అభిమానంగా పిలుచుకున్న యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్ ను మార్చివేసి ఇంటర్ నేషనల్ స్టార్ గా మార్చివేసారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల ట్యాగ్ లు అన్నీ మారిపోతున్నాయి. దీనితో రానున్న రోజులలో ఇదే ట్యాగ్ లు ఈ హీరోలకు కొనసాగుతాయా లేదంటే మరికొన్ని కొత్త ట్యాగ్ లు వారి పెరుముందు వచ్చి చేరుతయా అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ కు మినహాయింపుగా ఒక్క మహేష్ పవన్ కళ్యాణ్ లు మాత్రమే కనిపిస్తున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ పవన్ ను పవర్ స్టార్ అనీ మహేష్ ను సూపర్ స్టార్ అనీ అతడి అభిమానులు పిలుచుకుంటూనే ఉన్నారు. దీనితో రానున్న రోజులలో వీరి ట్యాగ్ లు కూడ మారిపోతాయా అంటూ సోషల్ మీడియాలో కొందరు జోక్ చేస్తున్నారు..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: