ఆ స్టార్ హీరోతో నటించాలని కోరికగా ఉందంటున్న సమంత..?

Anilkumar
గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'శాకుంతలం'. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న సమంత ఆ ఇంటర్వ్యూలో వెల్లడిస్తున్న విషయాలు అభిమానులను ఒకింత షాక్ కి గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు చాలామంది అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసి ఎన్నో విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తో ఫుల్ లెన్త్ రోల్ లో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..' ఫహద్ ఫాజిల్ తన డ్రీమ్ హీరో అని చెప్పుకొచ్చారు. 

గతంలో ఆయనతో కలిసి సూపర్ డీలక్స్ సినిమాలో నటించినా అది తనకు చాలదని చెప్పుకొచ్చారు. ఇక మలయాళం లో నేరుగా ఎప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్నకు సమంత.. ఫహాద్ ఫాజిల్ తో ఫుల్ లెన్త్ రోల్లో సినిమా చేస్తానని అన్నారు. అంతేకాకుండా మలయాళ సినిమాలను చూసి తాను చాలా విషయాలను నేర్చుకున్నాను అని తెలిపారు. మలయాళం లో కచ్చితంగా సినిమా చేస్తానని అయితే ఆ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానని సమంత తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. దీంతో సమంత తాజా ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇక శాకుంతలం సినిమాలో సమంతతో పాటు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక యశోద వంటి హిట్ తర్వాత సమంత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: