'ఈగ' సమయంలో కాలేజీ కుర్రాడు.. కానీ ఇప్పుడు సమంతతోనే రొమాన్స్?

praveen
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఒక గ్రాఫిక్ వండర్ సినిమా ఈగ. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక ఈగను హీరోగా పెట్టి కూడా హిట్టు కొట్టొచ్చు అన్న విషయాన్ని రాజమౌళి చేసి చూపించాడు అని చెప్పాలి. 2012లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అది సరే గానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా. సమంత మరికొన్ని రోజుల్లో శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


 గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. శాకుంతలం సినిమాలో సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. కాగా ప్రస్తుతం ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోని  కేరళలోని కొచ్చిలో జరిగిన సినిమా ప్రమోషన్స్ లో ఒక ఆసక్తికర విషయాన్ని దేవ్ మోహన్ చెప్పుకొచ్చాడు. సమంత హీరోయిన్గా నటించిన ఈగ సినిమా విడుదలైనప్పుడు తాను కాలేజీలో చదువుతున్న కుర్రాడుని అంటూ చెప్పుకొచ్చాడు.



 అప్పుడు థియేటర్లలో సమంతను చూసి ఎంతగానో అభిమానించాను అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత ఓ కంపెనీలో పనిచేసేటప్పుడు ఇక మా కంపెనీకి సమంత బ్రాండ్ అంబాసిడర్. యాడ్ షూట్ చేయడానికి వచ్చిన ఆమెను నేరుగా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఒకప్పుడు సమంత ఈగ సినిమాలో నటించినప్పుడు కుర్రాడిగా ఉన్నా దేవ్ మోహన్ ఇక ఇప్పుడు ఏకంగా శాకుంతలం సినిమాలో అదే సమంత తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం 5 ఏళ్ళు కావడం గమనార్హం. ప్రస్తుతం సమంత 35 ఏళ్ల వయస్సు ఉండగా దేవ్ మోహన్ కూ 30 ఏళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: