ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఇచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ... ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారఅనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

బింబిసార మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం కొంత కాలం క్రితమే ఏమిగిస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బింబిసారా మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో నిరాశ పరిచిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ డిజిటల్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 1 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ మూవీ కి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... ఆశకా రంగనాథ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: