ఎన్టీఆర్ ... కొరటాల మూవీకి ఆ టైటిల్ను ఫిక్స్ చేయనున్నారా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన ఎన్టీఆర్ తనకంటూ ఇండియా వ్యాప్తంగా ఒక అద్భుతమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ కి రత్న వేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. అలాగే ఈ మూవీ కి అనేక  హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేయనున్నారు. ముఖ్యంగా ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాల కోసం ఇప్పటికే దర్శకుడు కొరటాల హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ మాస్టర్ లను రంగం లోకి దించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమా కోసం "దేవర" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ మూవీ.పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: