"మీటర్" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి ... రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభం లోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కిరణ్ "మీటర్" అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిటీ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 127 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కి రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా ... సాయి కార్తీక్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తో ఈ యువ హీరో ఏ రెంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: