దసరా: అదరగొట్టిన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల?

Purushottham Vinay
దర్శకుడిగా తొలి సినిమాతో పెద్ద హిట్టు కొట్టాలంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది దర్శకులు మొదటి ప్రయత్నంతో అలరించినా కొందరు మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చారు. ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ ఎదురుకుంటారు.కానీ మొదటి సినిమాతోనే తమ మార్క్ చూపించిన కొందరు దర్శకులు కూడా ఇండిస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో ఖచ్చితంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నారు.తొలి సినిమా అది కూడా నాని లాంటి పాపులర్ హీరోతో.. అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇంకా కేవలం అతని మీద ఉన్న నమ్మకంతో నాని చాలా పెద్ద రిస్క్ చేశాడనే చెప్పాలి. తీరా చూస్తే దసరా సినిమా నాని నమ్మకాన్ని నిలబెట్టేలా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ సినిమాగా వచ్చిన దసరా సినిమా దర్శకుడిగా శ్రీకాంత్ ప్రతిభని బాగా నిరూపించింది. కథ ఎంత బాగా రాసుకున్నా కూడా కథనం ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నా తొలి సినిమాకి ప్రాబ్లెమ్ కచ్చితంగా ఉంటుంది.


అయినా సరే శ్రీకాంత్ దాన్ని చాలా సూపర్ గా హ్యాండిల్ చేశాడు.అయితే దసరా చూసిన కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదని అంటున్నారు. అక్కడక్కడ శ్రీకాంత్ దారి తప్పినా ఫైనల్ గా హీరో నాని దసరాని మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టేలా చేశాడు. తెలుగు సినిమాల్లో మట్టి వాసన ఇంకా కల్ట్ క్లాసిక్స్ రావట్లేదు అనుకునే టైం లో ఇప్పుడు మేకర్స్ అంతా అదే టైప్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాల లాగే దసరా కూడా ఒక కొత్త టర్న్ అని చెప్పొచ్చు.తమిళ దర్శకులు అయిన వెట్రిమారన్, బాల లాంటి దర్శకులు తెలుగులో లేరని ఒక వెలితి ఉండేది.కానీ ఆ తరహా దర్శకుడుగా శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమాతోనే నిరూపించుకున్నాడు. దసరా సినిమా చూసిన కొంతమంది తెలుగు పరిశ్రమకు మరో సూపర్ డైరెక్టర్ దొరికాడని చెప్పుకుంటున్నారు. తనలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చిన నానికి.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న శ్రీకాంత్ ఓదెలకు ఈ సినిమా ఫలితం ఖచ్చితంగా మంచి పేరుని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: