కంగారులో.. ఎన్టీఆర్ ని అలా పిలిచేసిన జాన్వి కపూర్?

praveen
ప్రస్తుతం నందమూరి అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్న సినిమా ఏది అంటే అటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 అనే సినిమా కోసమే అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చినప్పటికీ పూజా కార్యక్రమాలు మాత్రం రీసెంట్ గానే జరిగాయి. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని అటు తారక్ కూడా భావిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తారక్ అటు త్రిబుల్ ఆర్ విజయం తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన నేపథ్యంలో అతని తర్వాత సినిమాల గురించి అటు ప్రపంచ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 కాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. అయితే ఒకప్పుడు ఇక జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో జోడి కట్టింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్కు పర్ఫెక్ట్ జోడిగా కూడా పేరు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు అదే పేరుతో ఉన్న తారక్ తో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ జోడి కట్టెందుకు సిద్ధమైంది. ఇక ఇటీవలే పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ లో చిట్టి పొట్టి బట్టలతో అలరించిన జాన్వి.. తెలుగులో మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనిపించబోతుంది అన్నది తెలుస్తుంది.

 అయితే ఎన్టీఆర్ను మొదటిసారి కలిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తారక్ ను ఏమని పిలవాలో తెలియక సార్ అని పిలిచిందట. కానీ మన తారక్ మాత్రం తనను ఎన్టీఆర్ లేదా తారక్ అని పిలవాలని సూచించాడట. అయినప్పటికీ జాన్వి కపూర్ మాత్రం తారక్ ని అలా పిలవలేక పోయిందట. నందమూరి ఫ్యామిలీ గొప్పతనం గురించి మా అమ్మ చాలా సార్లు చెప్పింది. మీ పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తున్న.. మిమ్మల్ని పేరు పెట్టి పిలువలేను అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చిందట జాన్వి కపూర్. ఇక ఎన్టీఆర్ తో నటిస్తున్న సినిమా జాన్వికపూర్ కు తెలుగులో మొదటి సినిమా కావడంతో ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: