ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్..!

Divya

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలనే లైన్ అప్ చేస్తున్న ఈయన గ్యాపు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఇకపోతే ఇందులో సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోంది అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  అలాగే సినిమా నుంచి అప్డేట్స్ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వరుసగా అప్డేట్స్ ఇస్తామని చెప్పిన మేకర్స్.. తాజాగా ఆది పురుష్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి పోస్టర్ను రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ పోస్టర్లో సీతారాములుగా ప్రభాస్ , కృతి కనిపిస్తుండగా..  పక్కన లక్ష్మణుడు , ఆంజనేయుడు కూడా కనిపించారు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అంతే కాదు పోస్టర్తో పాటు.." మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జైశ్రీరామ్" అంటూ కొటేషన్ చేయడం ఇప్పుడు మరింతగా అలరిస్తోందని చెప్పవచ్చు.
ఇకపోతే ఆది పురుష్ లేటెస్ట్ అప్డేట్ తో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. జూన్ 16వ తేదీన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇకపోతే మరోవైపు సలార్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది.  కాబట్టి ఆది పురుష్ కంటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ముందుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: