"ఆది పురుష్" నుండి కొత్త పోస్టర్ విడుదల రేపు ఆ సమయానికి..?

Pulgam Srinivas
ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ కి సంబంధించిన తన బాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటించింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా ... సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. కొంత కాలం క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ప్రభాస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే రాగా ... ఈ మూవీ టీజర్ కు మాత్రం ప్రేక్షకుల నుండి ఎక్కువ శాతం విమర్శలే వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి విమర్శలు దక్కడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఏ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చాలా శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బంధం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడినప్పటికీ ఈ సినిమా యూనిట్ మాత్రం ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ యూనిట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ రేపటి నుండి ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: