అమెరికాలో లయ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Purushottham Vinay
టాలీవుడ్ లో 2000 లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో లయ కూడా చెరగని ముద్ర వేసింది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆ సినిమా తర్వాత మనోహరం, ప్రేమించు సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ సినిమాలకు గానూ ఆమె వరుసగా మూడు నంది అవార్డులు అందుకుంది. ఇలా వరుస నంది అవార్డులు అందుకున్న ఏకైన నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే లయ చాలా బాగా నచ్చేసింది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా చాలా న్యాచురల్ గా ఉంటుంది లయ. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన లయ ఇక తన కెరీర్‌ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది.ప్రస్తుతం భర్త ఇంకా పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న లయ సోషల్‌ మీడియాలో అయితే ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్‌ చేస్తూ నెట్టింట బాగా సందడి చేస్తోంది.


ఇంకా ఈ క్రమంలో ఇటీవల ఇండియా వచ్చిన లయ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ఆమె చేసే జాబ్‌, శాలరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.. 2011 వ సంవత్సరం నుంచి ఐటీ సెక్టార్‌లో జాబ్‌ చేసినట్లు చెప్పింది. నాలుగేళ్ల పాటు ఫుల్‌ టైం వర్క్‌ చేశానని, ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు చేసినట్లు ఆమె తెలిపింది.ఆ సమయంలో తన శాలరీ అన్ని ట్యాక్స్‌లు పోనూ మొత్తం 12000 డాలర్స్‌ అని చెప్పింది. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు రూ. 960, 000 అన్నమాట. నాలుగేళ్లు ఐటీ సెక్టార్‌ చేసిన తాను 2017 వ సంవత్సరంలో జాబ్‌ వదిలేసినంది.ఇక ఆ తర్వాత డాన్స్‌ స్కూల్‌ పెట్టానని, కరోనా కారణంగా అది మానేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం స్టార్ట్‌ చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్‌ చాలా మారిందంటూ ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేసింది.న్యూయార్క్‌ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని ఆమె కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: