పెళ్లికి సిద్ధం అయిన హనీ రోజ్..!

Divya
హనీ రోజ్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మకు ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ లభించింది అంటే అది బాలయ్య వల్లే సాధ్యమైందని చెప్పాలి. గతంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు లభించని ఈమెకు.. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా మరింత విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. పిచ్చెక్కించే ఫోజులతో కుర్రాళ్ళ నిద్ర లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఒక సినిమాతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో ఇదివరకే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో కూడా నటించింది అయితే పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాలో అవకాశం రావడంతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఏ ఫంక్షన్ కి వెళ్ళినా.. ఈవెంట్ కి వెళ్లినా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని అభిమానులు అడుగుతుంటే.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తాను అంటూ తెలిపింది. ఇప్పుడేమో పెళ్లికి సిద్ధంగా ఉన్నాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఒక మంచి కుర్రాడి కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కూడా తెలపడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి. ఆమె మాట్లాడుతూ.."  జీవితంలో పెళ్లి అనేది ఒక బాధ్యత.. దానికి నేను కట్టుబడి ఉంటాను. ముఖ్యంగా వివాహ బంధం బలంగా ఉండడం కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధమే"  అంటూ తెలిపింది.
ఇకపోతే ఈ హనీ రోజ్ పేరు ఇప్పటివరకు ఎలాంటి ఎఫైర్లలో కూడా వినిపించలేదు.. ఒకవేళ రిలేషన్షిప్ దాచినా సరే ఎక్కువకాలం కొనసాగించలేనని కూడా గతంలో తెలిపింది. మరి ఈమెకి కాబోయే వరుడు ఎలా ఉంటాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: