రామ్ ... బోయపాటి మూవీలో మరో బాలీవుడ్ బ్యూటీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న వారిలో రామ్ పోతినేని ఒకరు . ఈ హీరో ఇప్పటికే ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఆఖరుగా కూడా రామ్ "ది వారియర్" అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కాకపోతే ఈ మూవీ లో రామ్ మాత్రం తన అద్భుతమైన మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం కూడా రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ బృందం ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌటెల కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని ఐటెం సాంగ్ లో ఊర్వశి తో పాటు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ మరియు బోయపాటి ఇద్దరికీ కూడా ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉండనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: