HBD: ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..!!

Divya
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అభిమానులు పూల వర్షం కురిపించారు. ముఖ్యంగా గులాబీ రేకులకు ఆయన పైన కురిపిస్తూ వాటితో పరిచిన బాట పైన నడిపించేలా చేశారు. చివరిగా గ్లోబల్ స్టార్ కేక్ కట్ చేయించడం వంటివి కూడా జరిగింది. అయితే ఇదంతా RC -15 సినిమా సెట్లు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంక జరిగాయి .ఈ హడావిడి అంతా చూస్తూ ఉంటే అభిమానులే రామ్ చరణ్ బర్తడే సెలబ్రేషన్స్ ఇలా చేస్తున్నారేమో అని అనుకుంటాము కానీ ఇదంతా కేవలం RC -15 సినిమా షూటింగ్ లోనే చిత్ర బృందం చేశారు.

రామ్ చరణ్ పైన తమకు ఉన్న ప్రేమను ఈ స్థాయి లో చూపించారు. వీరంతా ఇక తమ హీరోకు సడన్సు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రామ్ చరణ్ 38 వ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. RC -15 చిత్ర బృందం రెండు రోజులు ముందుగానే ఈ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసింది. ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు రెండు రాష్ట్రాలలోని మెగా అభిమానులు చాలా ఘనంగా నిర్వహించ బోతున్నారు.

అంతే కాకుండా కొన్నిచోట్ల అన్నదాన శిబిరాలు మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు అభిమానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ హీరో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలను చాలా ధూంధాముగా జరపబోతున్నట్లు మెగా అభిమానులు తెలియజేస్తున్నారు. RC -15 ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను చర్చించుకుంటున్నట్లుగా డైరెక్టర్ శంకర్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి ,జయరాం తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డాన్సులు.. కియారా అద్వానీ అందం హైలైట్ గా నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: