పొన్నియన్ సెల్వన్ 2 : మ్యూజిక్ అండ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియావ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో వైవిద్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న మణిరత్నం ఆఖరుగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం పోయిన సంవత్సరం తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

ఈ మూవీ మొదటి భాగం తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోగా ... మిగతా భాషలలో పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది.

అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మ్యూజిక్ మరియు ట్రైలర్ ను మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: