"శాకుంతలం" 3డి ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్రం బృందం..!

Pulgam Srinivas
సమంత తాజాగా శాకుంతలం అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. గుణశేఖర్ ఆఖరుగా రుద్రమదేవి అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా ... అల్లు అర్జున్ ... రానా ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రుద్రమదేవి మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ మరికొన్ని రోజుల్లో శాకుంతలం అనే మరో భారీ బడ్జెట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "3డీ" లో కూడా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క "3డి" ట్రైలర్ విడుదల తేదీని మరియు వేదికను ఫిక్స్ చేసింది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క "3డి" ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 6 లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా "3డీ" ట్రైలర్ విడుదల తేదీని మరియు ఈవెంట్ ను తెలియజేస్తూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: