"దసరా" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంత సిద్ధం..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా ఊర మాస్ సినిమా అయినటు వంటి దసరా లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన కెరియర్ ను ప్రారంభించ బోతున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను ... టీజర్ ... ట్రైలర్ ... మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
 

అలాగే ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో నాని ... కీర్తి లుక్ లకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకను మార్చి 26 వ తేదీన అనంతపూర్ లోని "పి వి కే కే" ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ... ఆలమూరు రోడ్ లో నిర్వహించనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అన్ని పనులను ఈ మూవీ యూనిట్ పూర్తి  చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం అన్ని సన్నాహాలను చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజాగా ధూమ్ ధామ్ దసరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: