"ఆరెంజ్" మూవీకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వస్తున్న రెస్పాన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన క్రేజీ మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ అత్యంత భారీ అంచనాల నడవ విడుదల కావడానికి ప్రధాన కారణం ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో మగధీర తర్వాత విడుదల కాపడమే. ఆరెంజ్ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ... కొణిదల నాగబాబు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

 జెనీలియా ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి హరిస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లను కూడా రాబట్టలేక పోయింది. అలా ఆ కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయిన ఈ మూవీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అలాగే ఈ మూవీ లోని పాటలకు ఇప్పటికీ కూడా సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇలా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్న ఆరెంజ్ మూవీ ని ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్ లు కూడా ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ కోసం 12 షో లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ షో లు అన్ని కూడా ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. దానితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ కోసం మరిన్ని షో స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: