దసరాకి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లోనే మొట్ట మొదటి సారి హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ పాన్ ఇండియా మూవీ లో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులే అవుతున్న మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయింది.

అలాగే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ఇంకా కేవలం ఈ మూవీ షూటింగ్ ఓకే ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు అయితే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం.

ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: