మహేష్ 28వ మూవీని అప్పుడు రంగంలోకి దించనున్నారా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సముద్ర కని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక భారీ ఇంటి సెట్ లో ఈ మూవీ కి సంబంధించిన నైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మహేష్ సరసన పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటించబోతున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీ లీల పాత్ర సూపర్ గా వస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ నిర్మాత అయినటు వంటి సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కానీ ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన విడుదల కాపడం కష్టమే అని ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్రం బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేస్తారా ... లేక దసరా సందర్భంగా విడుదల చేస్తారా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: