"దసరా" మూవీలో తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డా... కీర్తీ సురేష్..!

Pulgam Srinivas
వెరీ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు  మరియు  తమిళ  మూవీ లలో నటించే ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగు లో చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

ఈ మూవీ లో కీర్తి పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు కీర్తి తాజాగా దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. నాని హీరో గా నటించిన ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి దసరా మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పక వచ్చింది.

తాజాగా కీర్తి దసరా మూవీ గురించి మాట్లాడుతూ ... దసరా మూవీ కి తెలంగాణ యాసలో  డబ్బింగ్ చెప్పేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. మామూలు సినిమాలకు అయితే రెండు రోజుల్లో డబ్బింగ్ పూర్తి అవుతుంది అని ... దసరా మూవీ కోసం 5 రోజులు డబ్బింగ్ చెప్పాను అని కీర్తి చెప్పుకొచ్చింది. ఈ మూవీ లో చేసిన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు కీర్తి చెప్పింది.ఈ మూవీ పై ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: