ఆ పాత్ర చేసినప్పుడు.. ట్రోల్స్ ఎదుర్కొన్నా : కీర్తి సురేష్

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది అని చెప్పాలి. అప్పటివరకు సాదాసీదా హీరోయిన్ గానే కొనసాగిన కీర్తి సురేష్  సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకక్కిన మహానటి సినిమాలో టైటిల్ రోల్ లో నటించిన కీర్తి సురేష్ ఒకసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ ఈ సినిమాలో అచ్చంగా అలనాటి సావిత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్ళీ నటించింది ఏమో అనేంతలా పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోసింది అని చెప్పాలి.

 అంతేకాదు నేటి జనరేషన్ ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త సావిత్రిగా మారిపోయింది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు తన నటనకు ప్రశంసలు కూడా అందుకుని జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన చూసిన తర్వాత మరే హీరోయిన్ అయినా కూడా కీర్తి సురేష్ ల సావిత్రి పాత్రకు న్యాయం చేయలేకపోయేదేమో అని ప్రతి ఒక్కరిలో కూడా భావన కలిగింది అని చెప్పాలి. ఇకపోతే నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా మూవీ మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ హీరోయిన్.

 ఇకపోతే తన కెరీర్ లోనే ఒక మైలురాయి లాంటి సినిమాగా నిలిచిన మహానటి సినిమా గురించి ఇటీవల కీర్తి సురేష్ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించేందుకు మొదట ఎంతగానో భయపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాతో మాట్లాడి ఒప్పించడంతో ఓకే అన్నాను అంటూ తెలిపింది.  అయితే సావిత్రమ్మకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పాత్రను ఎంచుకున్నందుకు ఎంతో మంది సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ చేశారు. ఎన్నో విమర్శలు, సవాళ్లు ఎదుర్కున్నప్పటికీ ఆ పాత్ర చేసినందుకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కీర్తి సురేష్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: