రంగమార్తాండ: ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ నటి నటులు అయిన ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'రంగ మార్తాండ'. ఈ సినిమాకి సీనియర్ స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. కృష్ణ వంశీ లాస్ట్ టైం 'నక్షత్రం' అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా ఘోరంగా ప్లాప్ అయింది.ఆ షాక్ తో చాలా కాలం గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ ఇప్పుడు ఈ 'రంగమార్తండ' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.టాలీవుడ్ స్టార్ బ్యానర్ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22 వ తేదీన  థియేటర్లలో విడుదల అయ్యి ఎంతగానో అలరిస్తోంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని బాగా చూసేస్తున్నారు. ఈ సినిమాలోని ఎమోషన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బ్రహ్మానందం యాక్టింగ్ కి ఎంతగానో ఫిదా అవుతున్నారు.


మరాఠీ సూపర్ హిట్ సినిమా అయినా 'నట సామ్రాట్' మూవీకి రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇంకా అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్‌లో దాదాపు మొత్తం 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది. రాహుల్‌ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్‌ బాలకృష్ణ ఇంకా అలాగే శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సౌత్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: