"విరూపాక్ష" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.
 

ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "నచ్చావులే నచ్చావులే" అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో సాయి తేజ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. సాయి తేజ్ ఈ మూవీ తో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి వినోదయ సీతం రీమేక్ మూవీ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: