ప్రభాస్ "సలార్" మూవీ ఓవర్సీస్ డీల్ పూర్తి..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అత్యంత భారీ ప్రాజెక్టు లలో సలార్ మూవీ ఒకటి. ఈ మూవీ ని మొదట తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. కాకపోతే ప్రస్తుతం ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. దానితో ఈ మూవీ ని ఇంగ్లీష్ భాషలో కూడా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ భారీ బడ్జెట్ క్రేజీ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పృథ్విరాజ్ సుకుమారన్ ... జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ ... శృతి హాసన్ ... జగపతి బాబు ... పృధ్విరాజ్ సుకుమారన్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేసింది. ఇవి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కేవలం ఈ మూవీ కి సంబంధించిన 15 నుండి 20 రోజుల షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ రోజుల్లోనే ఈ షూటింగ్ పార్ట్ ను కూడా ముగించి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిలిం సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: