సిద్ధార్త్ తో ప్రేమపై ప్రశ్న.. అదితి షాకింగ్ ఆన్సర్?

praveen
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అదితి రావు హైదరీ. ఈ అమ్మడికి ఎంతో టాలెంట్ ఉంది. ఇక అందం అభినయంలోనూ ఎవరికి తక్కువ కాదు. కానీ ఎందుకో అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నప్పటికీ వరుస అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే గత కొంతకాలం నుంచి మాత్రం అదితి రావు హైదరి వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తన సినిమాల ద్వారా కాదు ఏకంగా తన ప్రేమాయణం ద్వారా ఇలా వార్తల్లో నానుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. మహాసముద్రం సినిమాలో సిద్ధార్త్ తో కలిసి నటించింది ఈ హీరోయిన్. ఇక ఆ సమయంలో సిద్ధార్థ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అన్నది తెలుస్తుంది. ఇక ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ ఎక్కడబడితే అక్కడ చట్టాపట్టాలేసుకుని తిరగడం మీడియా కంట పడింది. ఇంకేముంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక శర్వానంద్ పెళ్లిలో ఈ ఇద్దరు కలిసి హాజరై ఫోటో దిగడం అయితే ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ తో ఉన్న రిలేషన్షిప్ గురించి జర్నలిస్ట్ ప్రశ్న అడగగా ఆసక్తికర సమాధానం చెప్పింది అదితి రావు హైదరి. ప్రేక్షకులు ఇప్పటివరకు ఎవరు కూడా తనను ఇలాంటి ప్రశ్న అడగలేదు అంటూ చెప్పుకొచ్చింది. అందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే నేను తప్పకుండా చెబుతాను. ఇక ప్రతి ఒక్కరికి ఏదో ఒక దానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి విషయాలపై ఉండొచ్చు.  సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి మాట్లాడుతూ నేనేం చెప్పాలి.. మీకే ఒక అభిప్రాయం ఉంది. నేనేం చెప్పినా కూడా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lov

సంబంధిత వార్తలు: