మొదటిరోజు "దాస్ కా దమ్కి" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ నటించింది. ఈ మూవీ నిన్న అనగా మార్చి 22 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి.

మరి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయో తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 91 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 43 లక్షలు , యు ఏ లో 40 లక్షలు , ఈస్ట్ లో 30 లక్షలు , వేస్ట్ లో 20 లక్షలు , గుంటూరు లో 40 లక్షలు , కృష్ణ లో 25 లక్షలు ,  నెల్లూరు లో 17 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.06 కోట్ల షేర్ కలక్షన్ లు దక్కాగా ... 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 40 లక్షల కలెక్షన్ లు దక్కగా ,  ఓవర్ సీస్ లో 62 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 4.06 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా మొదటి రోజు విశ్వక్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: