"ఎన్బికె108" లో బాలయ్య ఎంట్రీ సీన్ అదే..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ లో శ్రీ లీల జాయిన్ అయినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఖరారు చేయకపోవడంతో ... ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎన్ బి కె 108" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానుల తో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 ఇది ఇలా ఉంటే ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో బాలకృష్ణ పై అదిరిపోయే ఎంట్రీ సీన్ ను అనిల్ రావిపూడి తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అనిల్ రావిపూడి ఈ మూవీ లో బాలకృష్ణ కోసం అదిరిపోయే ఎంట్రీ సీన్ తీసినట్లు సమాచారం. ఈ మూవీ లో బాలకృష్ణ జైల్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ... ఈ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయే మాస్ లెవెల్లో ఉండబోతున్నట్లు ... అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: