"ఏజెంట్" మూవీ సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్రం బృందం ఒక టీజర్ ను మరియు ఒక పాటను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ కు మరియు పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి  ఎందే ఏందే అనే సాంగ్ ప్రోమో ను మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... అలాగే ఫుల్ సాంగ్ ను మార్చ్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో అఖిల్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: